|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 10:40 AM
TG: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్‌ప్లాంటులో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఆయిల్ నేలపై పడగా, అదే సమయంలో అక్కడ వెల్డింగ్ పనులు చేయడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ట్రయల్ రన్ కు సిద్ధం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.