|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:03 PM
యువత ప్రస్తుతం మద్యానికి కన్నా ఎక్కువగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా మారుతున్నారు. ఒక్క రోజులో లక్షాధికారులు కావచ్చనే ఆశతో కష్టించి సంపాదించిన డబ్బును పెట్టి, సర్వస్వం కోల్పోతున్నారు. తిరిగి ఆ డబ్బును సంపాదించలేక.. అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన వారు శోకసంద్రంలో ముంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, బెట్టింగ్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి