|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:19 PM
తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఇదే గొప్ప అవకాశం. ఏప్రిల్ 28 సోమవారం నాటి ధరల ప్రకారం.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,200గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,010గా నమోదయ్యాయి. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.1,11,800 పలికింది. ప్రస్తుతం పసిడి ధరలు గతవారం తో పోలిస్తే సుమారు రూ.4,000 తక్కువగా ఉంది. ఇది బంగారం కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్ గా చెప్పొచ్చు.బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం మార్కెట్‌లో ఏర్పడిన పరిస్థితులు. ముఖ్యంగా అమెరికా-చైనా దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండటం, అలాగే అమెరికా డాలర్ బలపడటం వంటివి పసిడి ధరల తగ్గుదలకి దోహదం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గడం ప్రారంభమైంది. ప్రస్తుతం బంగారం ధర సుమారు 3330 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో ముఖ్యమైన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసుకొని స్టాక్ మార్కెట్‌లో మళ్లిస్తున్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు తగ్గుతున్నాయి. అలాగే ఈటీఎఫ్ బాండ్స్ ద్వారా బంగారంలో పెట్టుబడి చేసిన వారు, బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర రూ.72,000 మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు కొంత తగ్గడం జరిగింది.