|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:20 PM
ట్రాఫిక్ పోలీసులు అల్వాల్, జీడిమెట్ల, బాలానగర్ పరిధిలో రెండు రోజులపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. 76 మంది మందుబాబులు వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. అల్వాల్ ట్రాఫిక్ పరిధిలో సుచిత్ర, దూలపల్లి చౌరస్తా, కొంపల్లి ప్రాంతాల్లో 30 మంది, అలాగే జీడిమెట్ల పరిధిలో 25 మంది, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.