|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:22 PM
కాలనీలు అభివృద్ధి చెందాలంటే సంక్షేమ సంఘాలు క్రియాశీల పాత్ర పోషించాలని కంటోన్మెంట్ బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. సంచారపురి కాలనీ 25వ వార్షికోత్సవంలో బోర్డు సీఈవో మధుకర్ నాయక్తో పాటు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ముఖ్యంగా కాలనీ సంక్షేమ సంఘాలు బాధ్యతాయుతంగా ఉండటం అభినందనీయమన్నారు.