|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:36 PM
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతుకు చట్టం భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవిన్యూ అవగాహన సదస్సులో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహశీల్దార్ ఆండాలు, ఎంపిడిఓ లక్ష్మీ నారాయణ, ఏఓ, ఏడీఏ పరుశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.