|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:22 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."కేసీఆర్ కుటుంబం తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది. ప్రాజెక్టులు, భూముల పేరిట దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశారు. రానున్న యువతరం ఎప్పటికీ కేసీఆర్‌ను క్షమించదు." అని అన్నారు.