|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:22 PM
ఆదివాసి జాతిని హననం చేస్తున్న ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎఫ్ టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ మాట్లాడుతూ చత్తీస్ ఘడ్- తెలంగాణ సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మరిపిస్తుందన్నారు. సాయుధ పోలీస్ బలగాలు ఏకపక్ష దాడులను వెంటనే ఆపాలని, శాంతియుత వాతావరణంకు ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు.