|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 02:43 PM
హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని PVNR ఫ్లై ఓవర్ పై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొనగా.. వేగం మీద ఉన్న ఓ కారు పల్టీ కొట్టి డివైడర్ మీద పడిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అవ్వడంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సివిల్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కారును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.