|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 02:37 PM
తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది.