|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 04:07 PM
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు భూసేకరణ విషయంలో నల్గొండ జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. రైతులను ఒప్పించిన తర్వాతే భూసేకరణ చేస్తామమని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. గత BRS ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నల్గొండ కలెక్టరేట్ అదనపు బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.