|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 04:01 PM
తెలంగాణలోని మేడ్చల్‌లో ఆబ్కారీ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కోటి రూపాయలు విలువైన 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. గంజాయిని పనసకాయల లోడ్ ముసుగులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో గణేశ్ రామస్వామి, విజయ్‌శంకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.