|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 11:23 PM
తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు రూ.20వేల జరిమానా విధించింది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని 19 మంది పిటిషన్ వేశారు. పిటిషనర్లు తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తెలిపారు. వివరాలను పరిశీలించిన హైకోర్టు.. అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పేర్కొంది.