|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:34 PM
జార్ఖండ్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా ఆమె స్నేహితుడు విష్ణు బైక్‌పై కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ తన ఫ్రెండ్స్ జగదీశ్, దీపక్‌తో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.