|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 04:01 PM
రాజంపేట మండల కేంద్రంలో బుధవారం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచిన కేజీబీవీ రాజంపేట పాఠశాల విద్యార్థిని గుర్రాల వర్షశ్రీని గురువారం మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్ ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షశ్రీ మంచి మార్కులతో మండలంలో టాపర్ కావడం గర్వకారణమని అన్నారు. ఆమెను చూసి ప్రతి విద్యార్థి ప్రేరణ పొందాలని, కృషితో పాటు పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధ్యమని తెలిపారు.