|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 04:02 PM
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139వ మేడే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గల హమాలి యూనియన్ కార్యాలయం ముందు సిపిఐ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నారు.