|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:18 PM
జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసిన, వినియోగిస్తున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు.
శుక్రవారం నారాయణపేట పట్టణంలో పోలీసులు జాగిలాలతో కిరాణా, పాన్, క్రిమిసంహారక మందుల దుకాణాల్లో, పట్టణ శివారులోని నిర్మాణ భవనాల్లో తనిఖీలు చేసినట్లు చెప్పారు. యువత మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.