|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:36 PM
ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దు గ్రామం ఉట్కూర్ మండలం సమిస్తాపూర్ గ్రామ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ను శుక్రవారం ఎస్సై కృష్ణంరాజు తనిఖీ చేశారు. రికార్డును పరిశీలించారు.
ఇప్పటి వరకు తనిఖీ చేసిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ కేంద్రం వద్ద ఎల్లప్పుడూ అప్రమత్తంగా వుండాలని, కర్ణాటక నుండి వరి ధాన్యం రాష్ట్రంలోకి రానీయకుండా అడ్డుకోవాలని సూచించారు.