|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:42 PM
ఆదిలాబాద్ లోని అంబేద్కర్ భవనంలో దళిత, గిరిజన సంఘాల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ అధ్యక్షులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ కమిటీ లాంటి కమిటీలను వేయకుండా ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల.
మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ప్రత్యేక అధికారుల ద్వారానే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ కమిటీలను పూర్తిగా రద్దు చేయాలన్నారు