|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 12:00 PM
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు మే 5 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణుల నుండి దరఖాస్తులు మొదటి దశలో మే 20 వరకు స్వీకరించనున్నారు. అనంతరం, మే 26న మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 27 నుండి 31 వరకు సర్టిఫికేట్‌ల పరిశీలన జరుగుతోందని, జూన్ 2 నుంచి తరగతులు స్టార్ట్ అవుతాయని తెలిపారు.