|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 11:29 AM
విద్యా సముపార్జన ద్వారా మాత్రమే మనిషి ఉన్నత స్థాయికి చేరుకోగలడని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను శుక్రవారం శాలువాలతో సత్కరించారు. ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉందని భవిష్యత్తులో కూడా ఇష్టంతో మంచి ఉన్నత చదువులు చదివి సమాజంలోని పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరాలని అన్నారు.