|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 11:22 AM
హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడుకి గత నెల 16న ఒక నంబర్ నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది.. అయితే అందులో సూచించిన విధంగా హోటల్స్‌కు రేటింగ్ ఇచ్చాడు, తరువాత టెలిగ్రామ్ లో ఇచ్చిన టాస్క్‌లు అన్ని పూర్తి చేసిన యువకుడు. అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని యువకుడిని నమ్మించడంతో, మొదట రూ.1000 పెట్టుబడి పెట్టున యువకుడు. దానికి మంచి రిటర్న్స్ వచ్చినట్టు చూపించారు సైబర్ నేరగాళ్లు . దీంతో ఈజీ మనీపై ఆశతో క్రమక్రమంగా రూ.7,83,500 రూపాయలు పెట్టుబడి పెట్టిన యువకుడు . ఎన్ని రోజులకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించిన యువకుడు