|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 12:26 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు. కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన మునిపల్లి మార్తమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. మార్తమ్మ కు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన మూడు లక్షల రూపాయల చెక్కును శనివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు.