|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 02:00 PM
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించగా మౌళిక వసతులైన మంజీరా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ లీకేజీ, పార్క్ నిర్మాణం, స్మశాన వాటిక, ఆర్టీసీ బస్సు సౌకర్యం, పార్క్ నిర్మాణం, లబ్ధిదారులకు నోటీసులు జారీచేయడం వంటి సమస్యలతో అనేక ఇబ్బందుకు పడుతున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఇప్పటికే దుండిగల్, బహదూర్ పల్లి తో అనేక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద మౌళిక వసతులను కల్పించడంతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులతో పాటు ఇళ్లలోకి రాని వారికి కూడా అధికారులు వివరణ కోరుతూ నోటీసులు జారీచేస్తున్నారని, లబ్ధిదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరిస్తూ నోటీసులకు జవాబులు ఇవ్వాలని అన్నారు. అధికారులు కూడా లబ్ధిదారులకు నోటీసులు ఇస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించినట్లయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఆ దిశగా అధికారులు పనిచేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక వసతుల కల్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గాజుల సుజాత, రాఘవేందర్ రావు, రజితా రవికాంత్, కొలన్ మీనా సునీల్ రెడ్డి, కో- ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్, వాటర్ వర్క్స్ డిజిఎం చంద్ర మోహన్, టీడబ్ల్యూఎస్ ఈఈ రవీందర్, డిఈలు మారుతి, నర్సయ్య, ఏఈలు దుర్గా ప్రసాద్, కరుణాకర్, మున్సిపల్ మేనేజర్ పవన్, ఏఈ ప్రవీణ్, శానిటేషన్ ఇంచార్జ్ సుకృత, బాచుపల్లి డబల్ బెడ్ రూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తలారి రాము, ఉపాధ్యక్షుడు గోపాల్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామిరెడ్డి, మహేష్, ప్రసాద్,భరత్, జ్యోతిక, ప్రవీణ సుల్తానా, కుమార్ బాబు, నందిశ్వర్, జ్యోతి, విద్యా మోహన్, నాసర్ పటేల్, బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, ఉపాధ్యక్షులు రవీంద్రబాబు, మరియు కార్యవర్గ సభ్యులు జయరాజ్, మొజాహిద్, రిషి స్వామి, దమయంతి, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.