|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:40 PM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నుడా చైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ లతో కలిసి వెల్ నెస్ సెంటర్ లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.
ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.