|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:50 PM
పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో మేడే వారోత్సవాల్లో భాగంగా శనివారం కొత్త గేరిలో ఉన్న సిపిఎం జెండాను కార్యదర్శి శ్రీనివాసులు ఆవిష్కరించారు.
మే డే స్ఫూర్తితో కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల, కర్షకుల హక్కులని కాలరాస్తూ దేశ సంపదను సంపన్న వర్గాలకు దోచిపెడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చిమను ధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని కుట్ర చేస్తుందన్నారు.