|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 07:01 PM
నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీ బసవేశ్వర స్వామి 892వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ బసవేశ్వర నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నూతన సంఘ భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర ముఖ్య అతిథిగా విచ్చేసి, సంఘ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటోళ్ల సంగమేశ్వర మాటశ్వర మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లా స్థాయిలో సంఘ భవనాన్ని నిర్మించినందుకు నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. విశేష కృషి చేసిన కమిటీ సభ్యులను అభినందిస్తూ, సంఘ అభివృద్ధితో పాటు సామాజిక సేవలోనూ సంఘం ముందుండాలని ఆదివారం కోరారు.
సంఘసేవకు ప్రాధాన్యత ఇస్తూ, సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో నల్గొండ జిల్లా సంఘం ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.