|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 11:09 AM
హైదరాబాద్ - మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్(37). ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, డోర్ ఓపెన్ చేయని పవన్ కుమార్.దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో చనిపోయి కనిపించిన పవన్ కుమార్.పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో కనిపించిన పెంపుడు కుక్క.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.మధురానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, కుక్క పవన్ మర్మాంగాలను గాయపరిచిన దాడితోనే అతడి మృతి జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దుర్ఘటన మధురానగర్ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన తెలిసిన తర్వాత స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.