|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 11:30 AM
ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి అన్వేష్ స్పందిస్తూ.. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే కేసు పెడతారా? అని ప్రశ్నించారు. తనపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. కాగా హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ యాడ్స్‌కు రూ.300 కోట్లు లంచం తీసుకున్నారని డీజీపీ, మాజీ సీఎస్‌పై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు.ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.