|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 10:33 AM
TG: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ADBD, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, KMM, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, సూర్యాపేట, నారాయణ పేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.