|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:50 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలు వంటివాటితో అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నాటు కోడిని బలి ఇచ్చిన ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడ ఉన్న క్షుద్ర పూజారి సహా మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.