|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 02:04 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి లాంటి ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు, బలిధానాల గురించి వివరించారు.