|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:06 PM
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్మిక రంగం నేపథ్యం నుండి వచ్చిన తాను అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ అసంఘటితరంగా కార్మికులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.