|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 02:58 PM
దేశంలోనే తెలంగాణను సుసంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు పూర్తయింది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.