|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 07:55 PM
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్రైస్తవ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీబీఐ విచారణను బీజేపీ అడ్డుకుంటోందని, మాజీ మంత్రి కేటీఆర్ అవినీతిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం వల్లే ఈ చర్యలు తీసుకోలేకపోతున్నామని, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు.