|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:46 PM
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్‌పల్లి డివిజన్ గణేష్ నగర్ ఉన్నత పాఠశాలలో శనివారం ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మజ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు బాల్యవివాహాలను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేశారు. బాల్యవివాహం పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని, ప్రతి చిన్నారికి చదువు, ఆరోగ్యం, రక్షణ హక్కు ఉందని, ఎక్కడైనా బాల్యవివాహం జరిగితే 1098 లేదా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూపర్ వైజర్ పద్మజ పిలుపునిచ్చారు. విద్యార్థులే సమాజ మార్పుకు కారకులని, బాల్యవివాహాలను అరికట్టే చైతన్యం ప్రతి ఇంటికీ చేరాలని ప్రధానోపాధ్యాయురాలు మాధవి అన్నారు.