|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:24 PM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీసీ తన చాంబర్‌లో మల్లన్నను శాలువాతో సత్కరించారు. అనంతరం, మల్లన్న హాస్టల్స్, పలు విభాగాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్ట్స్ బ్లాక్‌లోని మినీ సమావేశ మందిరంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.