|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:23 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో శనివారం జగద్గిరిగుట్టలోని పీజీఆర్ అభిమానులు పీజీఆర్ విగ్రహానికి పాలు అభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీజీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. పీజీఆర్ తనయుడు పార్టీ మారడం, బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం మరింత బలపడిందని తెలిపారు.