|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 01:59 PM
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. దాడులకు పాల్పడినవారిపై 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని పేర్కొన్నారు. కేసు నమోదైతే పాస్‌పోర్టు జారీ, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని సీపీ తెలిపారు.