|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:29 PM
ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 కేసుల్లో ఏడు రోజులు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటివరకు రవిని రెండు విడతల్లో ఎనిమిది రోజులపాటు కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు విచారణలో బయటకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారించేందుకు ఇప్పుడు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది.