|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 05:34 PM
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈరోజు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్-1 ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే, ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించి, నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.