|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:53 PM
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నానని, శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని ఆయన వెల్లడించారు. '12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విక్రాంత్, రోజుకు 16 గంటలు పనిచేయడం వల్ల అలసిపోయి కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు.
Latest News