|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 11:28 AM
అందం, ప్రతిభ ఉన్నా కొందరు నటీమణులకు టాలీవుడ్‌లో ఆశించిన గుర్తింపు దక్కడం లేదు. గ్లామర్ షోకు వెనుకాడని, వర్కింగ్ అవర్స్ వంటి షరతులు లేని హీరోయిన్లకు కూడా లక్కు కలిసి రావడం లేదనే అభిప్రాయం ఉంది. గత ఏడాది "అల్లురి" సినిమాతో కాయదు లోహర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారినా, ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు.ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్రాగన్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కయాదు లోహర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈమెకి మంచి గుర్తింపు లభించింది. టాలీవుడ్‌లో మూడు ఏళ్ల క్రితమే ఈమె ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఆకట్టుకుంది. డబ్బింగ్ సినిమానే అయినా కయాదుకి డ్రాగన్‌తో మంచి పేరు వచ్చింది. తాజాగా తెలుగు నేర్చుకుంటున్నాను, త్వరలో తెలుగు సినిమాతో రాబోతున్నాను అని ప్రకటించింది.
Latest News