|
|
by Suryaa Desk | Sun, Nov 19, 2023, 08:25 PM
వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తాజాగా , ఈ చిత్రం నవంబర్ 17, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం డిజిటల్ ఎంట్రీ ఇచినప్పటి నుండి బాలీవుడ్‌ను అధిగమించి దేశవ్యాప్తంగా OTT ప్లాట్‌ఫారమ్‌లో అగ్రస్థానంలో ఉంది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, పిప్పా, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మరియు తమిళ బ్లాక్‌బస్టర్ జైలర్ వంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.