|
|
by Suryaa Desk | Tue, Feb 27, 2024, 07:23 PM
సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పడు నిర్మాత దిల్ రాజు మరియు రామ్ చరణ్ మార్చి 27న 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీని ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News