|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:27 PM
నారాయణపేట జిల్లా మక్తల్ లో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరంతరం కృషిచేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో జయశంకర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, జట్ల శంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.