![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:49 PM
ఒంటిపూట పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యం కొరకు సమయానికి బస్సులు నడిపించాలని మంగళవారం ఎబీవీపీ నాయకులు మంగళవారం నారాయణపేట డిపో మేనేజర్ లావణ్యకు వినతి పత్రం అందించారు.
జిల్లా కన్వీనర్ నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాలకు ఉదయం సమయానికి బస్సులు రాకపోవడంతో మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.