|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 08:34 PM
TG: రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ 2,650 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఉదయం 9.30గం. నుంచి మధ్యాహ్నం 12.30గం. వరకు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు సరైన సమయానికి చేరుకోవాలని సూచించారు.