![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 06:20 PM
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇచ్చిన సూచనలతోనే ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీకు ఉన్న 15 శాతం రిజర్వేషన్.. 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశామని తెలిపారు.