![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 07:36 PM
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు ఇవ్వనుంది. సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో ఆమె.. వర్సిటీ నుంచి 2016-2024 మధ్య వాహన అద్దెకు రూ.61 లక్షలు తీసుకున్నట్లు ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. వర్సిటీ వీసీ దీనిని ధృవీకరించగా, న్యాయ నిపుణుల సూచనలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని, రెండ్రోజుల్లో ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.